ePaper
More
    Homeఅంతర్జాతీయంLahore | లాహోర్‌ లో వరుస పేలుళ్లు

    Lahore | లాహోర్‌ లో వరుస పేలుళ్లు

    Published on


    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Lahore | పాకిస్తాన్(Pakistan)లోని ​ లాహోర్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. స్థానిక వాల్టన్ విమానాశ్రయం(Walton Airport) సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ పోర్టు వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగాయి. దీంతో పాక్(Pakistan) ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    డ్రోన్ కారణంగానే పేలుడు చోటుచేసుకున్నట్లు పాక్ పోలీసులు(Pakistan Police) చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ ను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్​లోని కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు విమానాశ్రయాలను(Airports) అధికారులు మూసేశారు.

    భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్'(Operation Sindoor) మరుసటి రోజే పేలుళ్లు జరగడం గమనార్హం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతున్నాయి.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...