ePaper
More
    Homeబిజినెస్​Pre Market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ..

    Pre Market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ..

    Published on

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Pre Market analysis | వాణిజ్య ఒప్పందాల(Trade agreement) విషయంలో ట్రంప్‌ సానుకూల ప్రకటనతో యూఎస్‌, ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. బుధవారం యూఎస్‌(US)కు చెందిన ఎస్‌అండ్‌పీ 0.43 శాతం, నాస్‌డాక్‌ 0.27 శాతం లాభంతో ముగియగా.. గురువారం డౌజోన్స్‌(Dow Jones) ఫ్యూచర్స్‌ సైతం 0.32 శాతం లాభంతో కొనసాగుతోంది. ఫెడ్‌ మీటింగ్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొలుత అమ్మకాలకు పాల్పడినా ఆ తర్వాత కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని పాజిటివ్‌గా ముగిశాయి.

    Pre Market analysis | యూరోప్‌ మార్కెట్లలో సెల్లాఫ్‌..

    యూరోప్‌(Europe) మార్కెట్లు మాత్రం నష్టాలతో ముగిశాయి. సీఏసీ 0.92 శాతం నష్టపోగా.. డీఏఎక్స్‌ 0.58 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.45 శాతం నష్టపోయాయి.

    Pre Market analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు..

    స్ట్రేయిట్‌ టైమ్స్‌ మినహా మిగతా ప్రధాన ఆసియా మార్కెట్లు గురువారం సైతం లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో హంగ్‌సెంగ్‌(Hang Seng) 0.81 శాతం లాభంతో ఉండగా.. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.41 శాతం, కోస్పీ 0.33 శాతం, నిక్కీ 0.23 శాతం, షాంఘై(Shanghai) 0.21 శాతం లాభంతో ఉన్నాయి. స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.28 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.09 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు స్లైట్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market analysis | గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా 15వ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. వారు బుధవారం నికరంగా రూ. 2,585 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,378 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర 58.32 డాలర్లకు చేరింది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ మళ్లీ పడిపోతోంది. బుధవారం 38 పైసలు పడిపోయి 84.82 వద్ద నిలిచింది.
    • ఇండియా విక్స్‌(VIX) ఆందోళనకర స్థాయిలో ఉంది. బుధవారం 0.34 శాతం మేర పెరిగి, 19.06కు చేరింది. ఇది మార్కెట్లలో తీవ్ర వొలటాలిటీని సూచిస్తోంది.
    • నిఫ్టీ పుట్‌ కాల్‌ రేషియో(PCR) 0.92 నుంచి 0.97 కు పెరిగింది. ఇది బుల్స్‌కు అనుకూలం. భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
    • యూఎస్‌ ఫెడ్‌(Fed) వరుసగా మూడో మానిటరీ పాలసీ మీటింగ్‌లోనూ వడ్డీ రేట్లు తగ్గించడానికి ఆసక్తి చూపలేదు. ఎప్పుడు తగ్గిస్తామన్న దానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండడం, ఇన్‌ఫ్లెషన్‌ ఒత్తిడి ఉండడంతో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.
    • వాణిజ్య ఒప్పందాల విషయంలో ట్రంప్‌(Trump)నుంచి సానుకూల స్పందన వచ్చింది. గురువారం నిర్వహించే కాన్ఫరెన్స్‌లో మేజర్‌ ట్రేడ్‌ డీల్స్‌పై ప్రకటన ఉండొచ్చన్న అంచనాలతో యూఎస్‌ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి.

    Latest articles

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    More like this

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...