Vasavimata Jayanti : కనులపండువగా వాసవీమాత జయంతి
Vasavimata Jayanti : కనులపండువగా వాసవీమాత జయంతి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Vasavimata Jayanti : పట్టణంలోని ఆర్యవైశ్యభవన్‌లో బుధవారం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఉదయమే ఆలయంలో అమ్మవారికి మేలుకొలుపు సేవలు చేశారు. అనంతరం మాత మూలవిరాట్‌ను పట్టు వస్త్రాలు, నగలతో అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

మహిళలు ఉయ్యాల కార్యక్రమం, సామూహిక కుంకుమార్చన పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా మహిళా అధ్యక్షులు విజయలక్ష్మి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్, బాలకిషన్, సిద్ధి చక్రధర్, వెంకటేశం, శ్రీనివాస్, విఠల్, సంతోష్ తదితరులు ఉన్నారు.