అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bonalu celebrate : ఎల్లారెడ్డి మండలంలోని జంగమయ్యపల్లి గ్రామంలో బుధవారం ప్రజలు గ్రామదేవతలకు భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాలు ఊరేగింపు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి గ్రామ ప్రజలు అందరితో కలిసి బోనం ఎత్తుకుని దుర్గమ్మ, పోచమ్మ, మైసమ్మ దేవతల కు మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని గ్రామ దేవతలకు కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్యం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు సామెల్, జంగమయ్యపల్లి మాజీ సర్పంచి భూషణం, పీఏసీఎస్ డైరెక్టర్ సుకేందర్ రెడ్డి, అడవి లింగాల్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.