అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Traffic ACP | నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీగా మస్తాన్ అలీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సిటిసి ఏసీపీగా పనిచేస్తున్న ఆయనకు ట్రాఫిక్ ఏసీపీగా ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ఆయన మహిళా పోలీస్స్టేషన్లో సీఐగా పనిచేశారు. ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను.. ట్రాఫిక్ సీఐ ప్రసాద్, బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఎస్సైలు స్వాగతం పలికారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేసిన నారాయణను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే..
