ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | డ్రగ్స్‌ నియంత్రణకు సమష్టిగా కృషిచేయాలి

    Nizamabad Collector | డ్రగ్స్‌ నియంత్రణకు సమష్టిగా కృషిచేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad collector | జిల్లాలో గంజాయి, క్లోరోఫాం, అల్ప్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నియంత్రణకు ఆయా శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanmantu), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ (District Level Anti-Narcotics Committee) సమన్వయ సమావేశంలో మాట్లాడారు. యువత, విద్యార్థులు (youth and students) డ్రగ్స్‌ బారిన పడకుండా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకుగాను స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.

    విద్యాసంస్థలకు వంద మీటర్లలోపు పాన్‌షాపులు, సిగరెట్, గుట్కా, నికోటిన్‌ పదార్థాల విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్‌కు బానిసగా మారినవారికి డీ అడిక్షన్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌ (Counseling at the De-Addiction Center) ఇప్పించాలన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మెడికల్‌ షాపుల్లో (medical shops) నిషేధిత ఔషధాలు విక్రయించకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. ఆంధ్ర, ఒడిశా నుంచి మత్తు పదార్థాల రవాణ జరగకుండా రైల్వే అధికారులు పక్కాగా పర్యవేక్షించాలన్నారు. అలాగే కల్తీ కల్లుపై సైతం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి, డీఎంహెచ్‌ఓ రాజశ్రీ, డీఐఈవో రవికుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

    Latest articles

    Nalgonda | బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalgonda | నల్గొండలోని (Nalgonda) దారుణ హత్యాచార కేసులో జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు...

    Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | సెన్సెక్స్‌, నిఫ్టీలలో వరుస ఆరు వారాల నష్టాలకు బ్రేక్‌ పడిరది....

    Ex MLA Hanmanth Shinde | ఘనంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, నిజాంసాగర్: Ex MLA Hanmanth Shinde | జుక్కల్ (jukkal) నియోజకవర్గంలో గురువారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్​...

    Cloud Burst | జమ్మూకశ్మీర్​లో క్లౌడ్ బరస్ట్.. 12 మంది భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | జమ్మూ కశ్మీర్​లో (Jammu Kashmir) వర్షాలు బీభత్సం సృష్టించాయి. కిష్త్వార్​...

    More like this