అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Police Department |తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకుంది. హోంగార్డు(Home Guards) మొదలుకొని ఐపీఎస్ (IPS Officers) స్థాయి వరకు విధుల్లో అందుబాటులో ఉండాలని సూచించింది. అలాగే సెలవులను పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ మెమో జారీ(Home Ministry memo issued) చేసింది.
కాగా.. భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ ఘటన(Pahalgam terror Attack) తర్వాత ప్రతీకార చర్యగా భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాక్ భూభాగంలోకి చొరపబడి ఎయిర్ స్టైక్(Air strike) చేసింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. తిరిగి పాక్ నుంచి ప్రతీకార దాడులు ఉండే అవకాశాలు ఉండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఆర్మీకి సంబంధించి బెటాలియన్ కార్యాలయాలు (Army Battalion Office) ఉండడంతో భద్రతపై అధికారులతో సీఎం సమాలోచనలు చేశారు. పోలీస్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.