అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Raja Singh | హైదరాబాద్ సిటీ(Hyderabad)లోని పాతబస్తీ(old city Hyderabad)లో భారీ సంఖ్యలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉన్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)పై ఆయన స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల అడ్డాలకు వెళ్లి మరీ మన సైన్యం దాడులు చేసిందన్నారు. ప్రతి రాష్ట్రంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలను వారి దేశాలకు పంపుతున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు.
పాతబస్తీలో మాత్రం 15 వేల నుంచి 20 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని ఆయన ఆరోపించారు. వారికి ఎంఐఎం MIM party పార్టీ రక్షణ కల్పిస్తోందన్నారు. ఇప్పటికే వారు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు పొందారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని గుర్తించి వెంటనే తిరిగి ఆయా దేశాలకు పంపాలని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) కోరారు. అప్పుడే తెలంగాణ భద్రంగా ఉంటుందని అన్నారు.