ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Leopard | చనిపోతున్న చిరుతలు.. జిల్లాలో వరుస ఘటనలు

    Leopard | చనిపోతున్న చిరుతలు.. జిల్లాలో వరుస ఘటనలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Leopard | అడవిలో ఉండాల్సిన చిరుతలు జనాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నాయి. ఇందల్వాయి అటవీ రేంజ్‌ పరిధిలో (Indalwai forest range) ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అటవీ అధికారులు తిరిగి వాటి సంరక్షణ చర్యలు చేపట్టారు.

    సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో (Sirnapalli forest area) 2018లో రైలు ఢీకొని ఓ చిరుత గాయపడింది. దానికి చికిత్స అందించేందుకు అధికారులు హైదరాబాద్‌ తరలించగా కొద్ది రోజులకు చనిపోయింది. దేవి తండా వద్ద జాతీయ రహదారిపై (national highway) 2022 ఫిబ్రవరి నెలలో ఆర్టీసీ బస్సు (RTC bus hits) ఢీకొని మరో చిరుత మృతి చెందింది. గతేడాది చంద్రాయన్‌పల్లి, దగ్గి అటవీ ప్రాంతాల మధ్య కారు ఢీకొనడంతో ఓ చిరుత పులి తీవ్రంగా గాయపడింది. చంద్రాయన్‌పల్లి పెద్దమ్మ ఆలయం వద్ద ఆరు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో మరో చిరుత చనిపోయింది. బుధవారం తెల్లవారుజామున చంద్రాయ న్‌పల్లి (Chandrayanpally) వద్ద మరో చిరుత మృతి చెందింది.

    Leopard | జాతీయ రహదారిపైనే అధికం..

    ఇందల్వాయి మండలం (Indalwai mandal) మీదుగా జాతీయ రహదారి 44 (National Highway 44) ఉంది. కాగా.. ఈ మార్గంలో అటవీ ప్రాంతం (forest area) విస్తరించి ఉంది. రోడ్డుకు ఇరువైపులా అటవీ ప్రాంతం ఉండడంతో రోడ్డును దాటే క్రమంలో చిరుతలు హైవేపై వాహనాలు ఢీకొని మృతి చెందుతున్నాయి.

    Leopard | చెట్లు నరకడంతో..

    అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు అడవులను వదిలి బయటకు వస్తున్నాయి. కొందరు అక్రమార్కులు చెట్లను నరికివేసి వ్యవసాయ భూములుగా (agricultural lands) మారుస్తున్నారు. దీంతో వన్యప్రాణులు అడవిని వదిలి బయటకు వస్తున్నాయి. మరోవైపు వేసవిలో వన్యప్రాణుల తాగునీటి (drinking water) కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

    Leopard | కంచె ఏర్పాటు చేయాలి

    చంద్రాయన్‌పల్లి నుంచి దగ్గి (Chandrayanpally to Daggi) వరకు సుమారు ఐదు కి.మీ. మేర 44వ జాతీయ రహదారికి ఇరుపక్కల దట్టమైన అడవి ఉంది. అర్ధరాత్రి వేళ వన్యప్రాణులు (wild animals) అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్తుంటాయి. వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా కంచె ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులపై ఉంది.

    Latest articles

    Vesey Pace | లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీర‌ని విషాదం.. తండ్రి వెసీ పేస్ కన్నుమూత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vesey Pace | ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు, భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు...

    Balakrishna | పుష్ప‌2 జాత‌ర సాంగ్‌కి బాల‌య్య స్టెప్స్.. వైర‌ల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం(Pushpa 2...

    Makloor mandal | చెరువులోకి దూసుకెళ్లిన కారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Makloor mandal | కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మాక్లూరు...

    PM Modi | దేశ విభ‌జ‌న విషాద‌క‌ర అధ్య‌య‌నం.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | దేశ విభ‌జ‌న అత్యంత విషాద‌క‌ర అధ్య‌య‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ...

    More like this

    Vesey Pace | లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీర‌ని విషాదం.. తండ్రి వెసీ పేస్ కన్నుమూత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vesey Pace | ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు, భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు...

    Balakrishna | పుష్ప‌2 జాత‌ర సాంగ్‌కి బాల‌య్య స్టెప్స్.. వైర‌ల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం(Pushpa 2...

    Makloor mandal | చెరువులోకి దూసుకెళ్లిన కారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Makloor mandal | కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మాక్లూరు...