అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | ఉగ్రవాదం(Terrorism) ఎప్పటికైనా అంతం కావాల్సిందేనని.. సైన్యం ప్రదర్శించిన తెగువకు ఓ భారతీయుడిగా గర్వపడుతున్నాని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy) అన్నారు. ఈ మేరకు ఆర్మూర్లో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్న ఏ దేశానికి తీరని నష్టం చేకూరుస్తుందన్నారు. ఈ విషయంలో దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని అంతమొందించాలని కోరారు.
