ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | ఆప‌రేష‌న్ సింధూర్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆ ఇద్ద‌రు లేడీ ఆఫీసర్స్​.. వారి...

    Operation Sindoor | ఆప‌రేష‌న్ సింధూర్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆ ఇద్ద‌రు లేడీ ఆఫీసర్స్​.. వారి పాత్ర ఏంటి?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | జమ్మూకశ్మీర్​లో (Jammu and Kashmir) ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదుల్ని, వీళ్లను వెనుకుండి నడ్పించిన పాక్​ను గట్టిగా బుద్ది చెప్పాలని ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ రావ‌డంతో ఇండియన్ ఆర్మీ బుధవారం రాత్రి.. 1.30 నిమిషాల ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్​ (Operation Sindoor ) పేరుతో దాడులకు దిగింది. అయితే.. మొత్తంగా ఇండియన్ ఆర్మీ దళాలు (Indian Army forces).. పాక్ లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు (pakistan terrorist camps) జరిపి ముష్కరులు పీచమణిచాయి. ఈ రెస్క్యూలో ఇద్ద‌రు లేడీ ఆఫీస‌ర్స్ (Two lady officers) పాత్ర కూడా ఉంది. కల్నల్ సోఫియా ఖురేషి (sophia qureshi) బహుళజాతి సైనిక విన్యాసాలలో భారత సైన్యానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి కాగా (First woman officer to lead Indian Army), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh) అనేక కష్టతరమైన రెస్క్యూ మిషన్లను విజ‌య‌వంతంగా న‌డిపే ధైర్య‌శాలి. వీరిద్ద‌రూ ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాతో మాట్లడ‌గా, వారి పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వారి గురించి నెటిజ‌న్స్ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

    Operation Sindoor | లేడీ ఆఫీసర్స్ ఎవ‌రు..

    ముందుగా క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి (Colonel Sophia Qureshi) విష‌యానికి వ‌స్తే.. ఆమె భారత సైన్యం కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో (Indian Army Corps of Signals) నియమించబడిన ఆఫీస‌ర్. ఈమె బహుళజాతి సైనిక విన్యాసాలలో భారత సైనిక దళానికి (Indian Army in multinational military exercises) నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిణిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 2016లో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో కూడా ఆమె పాత్ర ఉంది. కల్నల్ ఖురేషి గుజరాత్ కు చెందినవారు కాగా, బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (postgraduate degree in biochemistry) పూర్తి చేశారు. ఆమె సైనిక కుటుంబం (military family) నుంచే వచ్చారు. ఖురేషీ తాత భారత సైన్యంలో పనిచేశారు. ఆమె మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన ఒక అధికారిని వివాహం చేసుకున్నారు. సాయుధ దళాలలోని మహిళలు దేశం కోసం కష్టపడి పనిచేయాలని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయాలని ఆమె ప్రోత్సహించేవారు. ఆమె స్త్రీ అని కాకుండా సామ‌ర్థ్యం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల ఆధార‌ణంగా ఆమెను ఎంపిక చేసిన‌ట్టు అప్పటి సదరన్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) అన్నారు.

    ఇక మ‌రో వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్ (Wing Commander Vyomika Singh) విష‌యానికి వ‌స్తే.. వైమానిక ద‌ళంలో చేర‌డం ఆమెకి చిన్న‌ప్ప‌టి క‌ల‌. పాఠశాల రోజుల నుండి విమానాల్లో ప్రయాణించాలని ఉండేది. వ్యోమిక అంటే ఆకాశంలో నివసించేది లేదా ఆకాశం కుమార్తె అని అర్థం. ఆమె నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించి, తరువాత ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఇండియన్‌ నేవీలో హెలికాప్టర్ పైలట్‌గా (Indian Navy helicopter Pilot) నియమితులయ్యారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ పొందారు. ఆమె చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను నడిపింది. ఆమె బహుళ రెస్క్యూ మిషన్లలో కీలక పాత్ర పోషించింది. ఆమె నాయకత్వం వహించిన ప్రధాన మిషన్లలో ఒకటి నవంబర్ 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) జరిగింది. 2021లో ఆమె 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ మణిరాంగ్‌కు ట్రై-సర్వీసెస్ ఆల్-ఉమెన్ పర్వతారోహణ యాత్ర కూడా చేశారు.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...