అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సింధూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
Operation Sindoor | అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. అత్యవసర ఔషధాలను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Operation Sindoor | రేపు సంఘీభావ ర్యాలీ
ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి మనం అండగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు చేపట్టనున్న ర్యాలీలో సీఎం రేవంత్, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.