అక్షరటుడే, ఆర్మూర్:MLA Prashanth Reddy | ప్రభుత్వం (Government) ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy) ఆరోపించారు.
కమ్మర్పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో రూ.10లక్షలతో పీఏసీఎస్ గోదాం, డీసీ తండాలో రూ.20లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస రావు Dco srinivasa rao, పీఎసీఎస్ ఛైర్మన్లు బాపురెడ్డి, దేవేందర్, ప్రతాప్, బీఆర్ఎస్ నాయకులు రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.