ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindhoor | ఆపరేషన్ సిందూర్.. కీలక ఉగ్రవాదులు హతం

    Operation Sindhoor | ఆపరేషన్ సిందూర్.. కీలక ఉగ్రవాదులు హతం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindhoor | భారత్​లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న వారికి, వారి వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు​ ఇండియన్​ ఆర్మీ(Indian Army) షాక్​ ఇచ్చింది. పహల్గామ్​ దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై భారత్(Indian army)​ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్​ సింధూర్(Operation Sindhoor)​ పేరిట భారత్​ పీవోకే, పాక్​లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు కీలక నేతలు హతం అయినట్లు సమాచారం.

    Operation Sindhoor | జైషే మమహ్మద్‌కు కోలుకోలేని దెబ్బ

    భారత్​ దాడితో జైషే మమహ్మద్‌(Jaish-e-Mohammed)కు కోలుకోలేని దెబ్బ తగిలింది. బహవల్‌పూర్‌లోనే జైషే స్థావరాన్ని వాయుసేన మట్టుబెట్టింది. దీంతో ఆ సంస్థ చీఫ్​ మసూద్‌ అజహర్‌(jaish e Chief Masood Azhar) బంధువర్గంలోని 10 మంది మృతి చెందినట్లు సమాచారం. అలాగే మురిడ్కేలోని మర్కజ్‌ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఇందులో లష్కరే తోయిబా నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌(Lashkar-e-Taiba leader Hafiz Abdul Malik) మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఉగ్రనేత ముదాసిర్‌(Terrorist leader Mudassir) కూడా చనిపోయాడు.

    Operation Sindhoor | ముంబయి దాడులకు ప్రతీకారం

    భారత్​లో కొన్నేళ్లుగా ఉగ్రవాదులు(Terrorists in pak) చేసిన దాడులకు భారత్​ తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ముంబై దాడులకు పాల్పడిన mumai terror attack అజ్మల్ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను సైతం తాజాగా ధ్వంసం చేసింది. మురిద్కేలోని లష్కరే తోయిబా ఉగ్ర శిబిరంలో వీరు శిక్షణ పొందారని, దానిని ధ్వంసం చేశామని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. పాక్​(Pakistan)లోని మొత్తం ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తామని వారు ప్రకటించారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...