ePaper
More
    HomeజాతీయంOperation karreguttalu | కర్రెగుట్టల్లో భారీ ఎన్​కౌంటర్​.. 22 మంది మావోల మృతి

    Operation karreguttalu | కర్రెగుట్టల్లో భారీ ఎన్​కౌంటర్​.. 22 మంది మావోల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Karreguttalu | తెలంగాణ – ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో ములుగు జిల్లా వెంకటాపూర్​ సమీపంలో గల కర్రెగుట్టల్లో భారీ ఎన్​కౌంటర్(Encounter)​ చోటు చేసుకుంది. ఈ గుట్టల్లో భారీగా మావోయిస్టులు(Maoists) ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు కొన్నిరోజులుగా ఆపరేషన్​ కర్రెగుట్టలు(Operation Karreguttalu) పేరుతో అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే పలు గుట్టలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం గుట్టల్లో కూంబింగ్​ నిర్వహిస్తున్న ఛత్తీస్​గఢ్ ​వైపు భద్రతా బలగాలు, మావోయిస్ట్​లకు మధ్య ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

    Operation Karreguttalu | టార్గెట్​ హిడ్మా

    మావోయిస్ట్​ కీలక నేత హిడ్మా(Hidma)తో పాటు దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఆశ్రయం పొందుతున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో వేల మంది బలగాలతో ఏప్రిల్​ 21 నుంచి ఆపరేషన్​ కర్రెగుట్టలు చేపడుతోంది. అటవీ ప్రాంతంలో సవాళ్లను అధిగమిస్తూ బలగాలు కూంబింగ్(Combing)​ చేపడుతున్నాయి. ఇప్పటికే పలు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఆపరేషన్​ కగార్​, ఆపరేషన్​ కర్రెగుట్టలు(Operation Karreguttalu) ఆపాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నాయి. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కూంబింగ్​ పేరిట ఎన్​కౌంటర్లు చేయడం సరికాదని వారు అంటున్నారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...