ePaper
More
    Homeక్రీడలుMI vs GT | రైన్ డ్రామా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ముంబై!

    MI vs GT | రైన్ డ్రామా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ముంబై!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MI vs GT | ఐపీఎల్ 2025 సీజన్‌లో (ipl 2025 season) గుజరాత్ టైటాన్స్ (gujarath titans) చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్‌తో (mumbai indians) మంగళవారం వాంఖడే వేదికగా వర్షం దాగుడు మూతలు ఆడిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. అనేక మలుపులు తిరుగుతూ.. ఐపీఎల్‌లో (ipl) ఉండే అన్ని ట్విస్ట్‌లను చూపిస్తూ.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది.

    ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ (batting) చేసిన ముంబై ఇండియన్స్ (mumbai indians) 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ (will jacks) (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) (24 బంతుల్లో 5 ఫోర్లతో 35) పర్వాలేదనిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్ (sai kishore) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయిట్జీ చెరో వికెట్ పడగొట్టారు.

    అనంతరం గుజరాత్ టైటాన్స్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం నిర్ణీత 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్ (shubham gill) (46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 43), జోస్ బట్లర్ (jos butler) (27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో (mumbai indians bowlers) ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్ రెండేసి వికెట్లు తీసారు.

    MI vs GT | వర్షం హైడ్రామా.. పాపం బుమ్రా.

    మొదటి వర్షం (rain) అంతరాయం తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా (jasprit bumrha) సంచలన బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ విజయం ముంగిట నిలిచింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయినా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ముంబై గెలిచేది. కానీ వరుణుడు శాంతించడంతో అంపైర్లు (umpire) ఒక ఓవర్‌ను కుదించి మ్యాచ్ నిర్వహించారు. దాంతో ఆఖరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి (gujarath victory) 15 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రాహుల్ తెవాటియా (Rahul Tewatia), గెరాల్డ్ కోయిట్జీ ఉండటంతో ముంబై విజయం లాంఛనమేనని అంతా భావించారు.

    MI vs GT | కొంపముంచిన దీపక్ చాహర్

    ఈ ఓవర్ వేసిన దీపక్ చాహర్ (Deepak Chahar) తొలి బంతికే బౌండరీ సమర్పించుకున్నాడు. దాంతో గుజరాత్‌కు మూమెంటమ్ వచ్చింది. రెండో బంతికి రాహుల్ తెవాటియా (Rahul Tewatia) సింగిల్ తీసాడు. మూడో బంతికి సిక్స్ బాదిన గెరాల్డ్ కోయిట్జీ.. నాలుగో బంతికి సింగిల్ తీసాడు. ఈ బంతి నోబాల్ కావడంతో గుజరాత్‌పై ఒత్తిడి తగ్గింది. ఫ్రీహిట్‌ను తెవాటియా సింగిల్ తీయడంతో స్కోర్లు టై అయ్యాయి. ఐదో బంతికి కోయిట్జీ భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్.. మిడాఫ్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా (hardik pandya).. రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చాడు. బంతిని సూర్యకుమార్ యాదవ్‌కు (Suryakumar Yadav) అందించినా.. మ్యాచ్ టై అయ్యేది. కానీ డైరెక్ట్ హిట్‌కు ప్రయత్నించడం.. బంతి స్టంప్స్‌ను మిస్సవ్వడంతో గుజరాత్ విజయం లాంఛనమైంది.

    ఈ గెలుపుతో.. గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో (points table) అగ్రస్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు (play-off berth) మరింత చేరువైంది. మరోవైపు ముంబై ఇండియన్స్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆఖరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.

    Latest articles

    Mohammed Siraj | సిరాజ్‌పై తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌ల వ‌ర్షం.. కొత్త డిమాండ్‌కు తెర‌లేపిన ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohammed Siraj | టీమిండియా (Team India) స్టార్ పేసర్ బౌలర్​ మహ్మద్ సిరాజ్...

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారులు...

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్...

    More like this

    Mohammed Siraj | సిరాజ్‌పై తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌ల వ‌ర్షం.. కొత్త డిమాండ్‌కు తెర‌లేపిన ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohammed Siraj | టీమిండియా (Team India) స్టార్ పేసర్ బౌలర్​ మహ్మద్ సిరాజ్...

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారులు...

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...