Ind-Pak | 1971 తర్వాత పాక్​ భూభాగంలో దాడులు.. కీలక ఉగ్రవాదుల హతం
Ind-Pak | 1971 తర్వాత పాక్​ భూభాగంలో దాడులు.. కీలక ఉగ్రవాదుల హతం


అక్షరటుడే, వెబ్​డెస్క్:Ind-Pak | జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్(Pahalgam)​లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భారత్​ పాకిస్తాన్​పై అనేక ఆంక్షలు విధించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను వదిలేది లేదని కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రకటించింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి భారత్​ పాక్​ ఆక్రమిత కశ్మీర్​తో పాటు, పాకిస్తాన్​లోని పలు ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది.


భారత్(India)​ 1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్‌(Pakistan) భూభాగంలోకి చొచ్చుకెళ్లి ​ దాడులు చేసింది. బంగ్లాదేశ్​ విభజన సమయంలో భారత్​, పాక్​ రెండు పూర్తిస్థాయిలో యుద్ధం చేశాయి. ఆ సమయంలోనే భారత్​ పాక్​లోకి వెళ్లి దాడులు చేసింది. తర్వాత కార్గిల్​ వార్​(Kargil War) సమయంలో భారత్​ బలగాలు పాక్​ సైనికులను కార్గిల్​ నుంచి తరిమికొట్టాయి. కానీ ఆ దేశంలోకి వెళల్లేదు. అనంతరం 2016లో సర్జికల్​ స్ట్రైక్స్​(Surgical Strikes), 2019లో బాలకోట్ ఎయిర్​స్ట్రైక్(Balakot Airstrike)​ భారత్​ జరిపింది. అయితే పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే పై రెండు సందర్భాల్లో భారత్​ దాడులు చేసింది. తాజాగా ఆపరేషన్​ సింధూర్​లో భాగంగా పీవోకేతో పాట పాక్​లోకి చొచ్చుకెళ్లి మరి ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు చేపట్టింది.


Ind-Pak | కీలక నేతల హతం

ఆపరేషన్‌ సింధూర్‌(Operation Sundhoor)లో భాగంగా భారత్​ జరిపిన దాడుల్లో కీలక ఉగ్రనేతల హతం అయినట్లు సమాచారం. మురిడ్కేలోని మర్కజ్‌ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఈ ఘటనలో లష్కరే తోయిబా నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌, మరో ఉగ్ర నేత ముదాసిర్‌(Terrorist Leader Mudassir) మృతి చెందినట్లు సమాచారం.

Ind-Pak | విమానాశ్రయాల మూసివేత

ఆపరేషన్​ సింధూర్​ అనంతరం పాక్(Pakistan)​ ప్రతీకార చర్యలకు దిగొచ్చని భారత్(India)​ భావిస్తోంది. ఈ క్రమంలో త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్​ దాడికి దిగితే తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్​ దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌(Airports)లు మూసివేసింది. ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్‌, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 9 నగరాలకు విమానాల రాకపోకలను ఎయిరిండియా రద్దు చేసింది.