ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | నాడు సర్జికల్​ స్ట్రైక్స్​​.. నేడు ఆపరేషన్ సింధూర్

    Operation Sindoor | నాడు సర్జికల్​ స్ట్రైక్స్​​.. నేడు ఆపరేషన్ సింధూర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్​ సింధూర్​ ద్వారా.. భారత్​ తాను ఏం చేయగలదో ఉగ్రవాదులతో పాటు, దాయదీ దేశానికి చాటి చెప్పింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని ఆపరేషన్​ సింధూర్​ ద్వారా భారత్​ స్పష్టం చేసింది.

    భారత్​ గతంలోలా కాకుండా ఉగ్రదాడి జరిగిన ప్రతిసారీ తీవ్రంగా స్పందిస్తుండటంతో దాయాదీ దేశం తలలు పట్టుకుంటోంది. పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత ప్రతీకారం కోసం చూస్తున్న భారత్​ ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి పీవోకేతో పాటు, పాకిస్తాన్​లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. ఉగ్రదాడులు చేస్తే తగిన బుద్ధి చెబుతామని తెలిసేలా భారత్​ ఇటీవల దాడులు చేస్తుంది. ఆపరేషన్​ సింధూర్ operation sindoor​ పేరిట చేసిన ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మొత్తం ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు భారత రక్షణ శాఖ difence ministry వర్గాలు తెలిపాయి.

    Operation Sindoor | అప్పుడు సరిహద్దు దాటి

    జమ్మూ కశ్మీర్​లోని ఉరిలో భారత ఆర్మీ స్థావరంపై 2016 సెప్టెంబర్ 18న జైషే – మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 19మంది సైనికులు అమరులయ్యారు. ఉగ్రవాదులకు బుద్ది చెప్పేందుకు అదే ఏడాది సెప్టెంబర్ 28న రాత్రి భారత ఆర్మీ నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది.

    Operation Sindoor | ఎయిర్​స్ట్రైక్స్​తో సమాధానం

    జమ్మూ కశ్మీర్​లోని పుల్వామలో భారత సీఆర్​పీఎఫ్​ బలగాల కాన్వాయ్​పై 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్​ 2019 ఫిబ్రవరి 26న పీవోకేలోని బాలకోట్, చకోతిలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. తాజాగా పహల్గామ్​ దాడికి ప్రతిచర్యగా పీవోకేతో పాక్​లోకి చొచ్చుకెళ్లి మరి దాడులు చేయడం గమనార్హం.

    Latest articles

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    More like this