ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | ‘టెర్ర‌ర్ న‌ర్స‌రీ’గా ‘ముర్కిదే’.. ల‌ష్క‌రే తోయిబా ఇక్క‌డ నుండే ఆప‌రేష‌న్స్ చేస్తుందా..?

    Operation Sindoor | ‘టెర్ర‌ర్ న‌ర్స‌రీ’గా ‘ముర్కిదే’.. ల‌ష్క‌రే తోయిబా ఇక్క‌డ నుండే ఆప‌రేష‌న్స్ చేస్తుందా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ప‌హ‌ల్​గామ్​లో 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌కు భార‌త ఆర్మీ(Indian Army) గ‌ట్టిగా బ‌దులిచ్చింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 1.44 గంట‌ల‌కు పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని 9 ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మెరుపుదాడుల‌తో విరుచుకుప‌డ‌డంతో ఒక్క బహావల్‌పూర్‌(Bahawalpur)లోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఈ దాడుల్లో 100 మందికిపైగా టెర్రరిస్ట్‌లు హతమైనట్టు తెలుస్తోంది.

    Operation Sindoor | అర్ధ‌రాత్రి దాడులు..

    ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడి(Pahalgam Terror Attack) వెనుకాల ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ ఉన్న‌ట్లు భార‌త సైన్యం అనుమానించింది. దీంతో ఆ సంస్థ‌కు ప్ర‌ధాన స్థావ‌ర‌మైన ముర్కిదేను భార‌త సైన్యం(Indian Army) ల‌క్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్‌లోని ప్ర‌ధాన వాణిజ్య కేంద్ర‌మైన లాహోర్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ముర్కిదే ఉంది. ముర్కిదేలో 200 ఎక‌రాల్లో ల‌ష్క‌రే తోయిబా త‌న ఉగ్ర‌స్థావ‌రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ల‌ష్క‌రే తోయిబా అనుబంధ సంస్థ జ‌మ్మ‌త్ ఉద్ దావా(Jammat-ud-Dawa) కూడా ఇక్క‌డి నుంచే త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్‌ India ధ్వంసం చేసింది.

    ముర్కిదే ప్రాంతం టెర్ర‌ర్ న‌ర్స‌రీ(Terror Nursery)గా పేరుగాంచింది. ఈ క్యాంపును 200 ఎక‌రాల్లో విస్త‌రించి, ఉగ్ర‌వాద శిక్ష‌ణా కార్యకలాపాల‌ను కొన‌సాగిస్తున్నట్లు సమాచారం. ఇది ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు ముర్కిదే ఒక న‌ర్వ్(నాడీ) సెంట‌ర్‌గా పేరుగాంచింది. ఇక్కడే అయితే 80 నుంచి 90 మంది దాకా టెర్ర‌రిస్టులు Terrorists చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. యుద్ధంలో పాల్గొన్న ఫైటర్‌ జెట్‌లు, పైలట్లు భారత్‌కు సేఫ్‌గా తిరిగివచ్చారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఐదు ప్రాంతాలే లక్ష్యంగా దాడులు జరిపింది. బ‌హ‌వ‌ల్‌పూర్ జైషే మ‌హ్మ‌ద్, ముర్కిదేలోని ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద స్థావరాల‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం. కాగా.. ‘ఆపరేషన్ సింధూర్‌’(Operation Sindhoor)ను భారత ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) స్వయంగా పర్యవేక్షించారు. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించినట్లు తెలుస్తోంది. కాగా.. నేడు 11 గంటలకు CCS కీలక భేటీ జరగనుంది. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...