Asaduddin owaisi | పాక్​ నేతలకు అసదుద్దీన్​ ఓవైసీ స్ట్రాంగ్​ కౌంటర్​
Asaduddin owaisi | పాక్​ నేతలకు అసదుద్దీన్​ ఓవైసీ స్ట్రాంగ్​ కౌంటర్​

అక్షరటుడే, హైదరాబాద్: Operation Sindoor : ‘ఆపరేషన్ సింధూర్’పై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ AIMIM chief Asaduddin Owaisi స్పందించారు. పాక్​పై భారత్​ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్​లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడులను స్వాగతిస్తున్నాం. మరో పహల్గావ్​ ఘటన జరగకుండా పాక్​కు ఇదే విధంగా సరైన గుణపాఠం చెప్పాలి. పాక్ ఉగ్ర స్థావరాలన్నింటిని పూర్తిగా ధ్వంసం చేయాలి. జై హింద్’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

కాగా, పాక్​పై భారత్ నిర్వహించిన మెరుపు దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్​ సింధూర్​ విజయవంతం నేపథ్యంలో ఆర్మీ అధికారులు మరికొద్ది సేపట్లో ప్రెస్​మీట్​ లో వివరాలు వెల్లడించనున్నారు.

1971 తర్వాత అంటే.. 54 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్​ భూభాగంపైకి భారత్​ వైమానిక దళాలు దూసుకెళ్లాయి. అక్కడి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఉగ్రవాదులను ఖతం చేశాయి.