అక్షరటుడే, ఇందల్వాయి : Sand Tractor | ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం వాగులో నుంచి ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాశెట్టి సాయికుమార్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ట్రాక్టర్ను సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ indalwai si sandeep తెలిపారు.