అక్షరటుడే, ఆర్మూర్ : Limbadri | భీమ్గల్లోని లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి జయంతి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగో రోజైన మంగళవారం స్వామివారిని శేష వాహనంపై ఊరేగించారు. ప్రయోజనకర్త నంబి లింబాద్రి, యమునా లింబాద్రి, భక్తులు పాల్గొన్నారు.
