అక్షరటుడే, నిజాంసాగర్: Mahammad nagar | మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ నర్సరీని (Telgapur Nursery) ఉపాధిహామీ ఏపీడీ వామన్‌రావు మంగళవారం పరిశీలించారు. ‘మొక్కల పెంపకంలో నిర్లక్ష్యమేల..?’ శీర్షికతో ఈనెల 5న ‘అక్షరటుడే’లో (Akshar Today)కథనం ప్రచురితం కాగా.. అధికారులు స్పందించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట ప్లాంటేషన్ మేనేజర్ సురేందర్, ఏపీవో శివకుమార్, టీఏ బాల్‌సింగ్, అనిల్ కుమార్ ఉన్నారు.
