ePaper
More
    HomeజాతీయంMallikarjun Kharge | మోదీ కాశ్మీర్ వెళ్లకపోవడానికి కారణమదే.. మల్లికార్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు

    Mallikarjun Kharge | మోదీ కాశ్మీర్ వెళ్లకపోవడానికి కారణమదే.. మల్లికార్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallikarjun Kharge | జమ్మూకాశ్మీర్లోని (Jammu and Kashmir) పహల్గామ్లో Pahalgam జరిగిన ఉగ్ర దాడిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Congress President Mallikarjun Kharge) సంచలన ఆరోపణలు చేశారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Prime Minister Narendra Modi) విమర్శలు గుప్పించారు. ఉగ్రదాడి (terror attack) గురించి నిఘా వర్గాలు (intelligence agencies) ముందే హెచ్చరించాయని, అందుకే మోదీ కాశ్మీర్‌ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. ఉగ్రదాడి ఘటనకు మూడు రోజులకు ముందే ఇంటెలిజెన్స్ సమాచారం (intelligence information) రావడంతో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. జార్ఖాండ్లోని రాంచీలో మంగళవారం జరిగిన ‘సంవిధాన్ బచావ్’ ర్యాలీలో ఖర్గే ఈ ఆరోపణలు చేశారు.

    Mallikarjun Kharge | నిఘా వైఫల్యం..

    పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించిందని ఖర్గే గుర్తు చేశారు. ”ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ప్రభుత్వం (government) కూడా దీనిని అంగీకరించింది. ఇంటెలిజెన్స్ పటిష్టం చేసుకుంటామని వాళ్లే చెప్పారు. అయితే దాడికి మూడు రోజుల ముందే ప్రధానికి నిఘా సమాచారం (intelligence information) అందినట్టు నాకు తెలిసింది. దాంతోనే ఆయన జమ్మూకశ్మీర్ పర్యటనను (Jammu and Kashmir visit) రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని వార్తా పత్రికల్లో కూడా చూశాను” అని ఖర్గే వ్యాఖ్యానించారు. ముందే నిఘా సమాచారం ఉన్నప్పుడు పహల్గామ్లో భద్రతను కట్టుదిట్టం ఎందుకు చేయలేక పోయారని నిలదీశారు. నిఘా వైఫల్యం ఉందని ఒప్పుకున్నప్పడు పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోతే అందులో కేంద్రానికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

    Mallikarjun Kharge | కేంద్రం చర్యలకు మద్దతు..

    ప్రభుత్వం (government) చేపట్టే ఉగ్రవాద వ్యతిరేక (anti-terror) చర్యలకు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని ఖర్గే తెలిపారు. పహల్గాం దాడికి వ్యతిరేకంగా పాకిస్థాన్ పై (pakistan) ఎలాంటి చర్య తీసుకున్నా మద్దతుగా ఉంటామని పునరుద్ఘాటించారు. తమకు దేశమే ముఖ్యమని చెప్పారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...