Inter special Classes | ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
Inter special Classes | ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి/గాంధారి: ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు నోడల్‌ అధికారి షేక్‌ సలాం(Nodal Officer Sheikh Salam) అన్నారు. గాంధారి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మంగళవారం పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ గంగారాం, అధ్యాపకులు లక్ష్మణ్, విజయ్‌ కుమార్, రాజగోపాల్, రమేశ్​, వెంకటస్వామి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.