అక్షరటుడే, కామారెడ్డి:Kamareddy | విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో కామారెడ్డి పట్టణంలో Kamareddy town రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా(Power supply) నిలిచిపోయింది. స్థానికులు పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం..
పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో ashok nagar colony kamareddy సోమవారం రాత్రి 11గంటల ప్రాంతంలో రాజు అనే వ్యక్తి కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి సమీపంలో 11కేవీ కరెంటు స్తంభాన్ని(electricity pole) ఢీకొనడంతో స్తంభం విరిగిపోయింది. రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా power interruption నిలిచిపోయింది. రాజుకు స్వల్పగాయాలయ్యాయి. స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్ ఘటనాస్థలానికి చేరుకుని రెండు గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. పోలీసులు police kamareddy కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.