- Advertisement -
HomeUncategorizedInd - pak | చొర‌బాటుకు య‌త్నం.. పాక్ జాతీయుడి అరెస్టు

Ind – pak | చొర‌బాటుకు య‌త్నం.. పాక్ జాతీయుడి అరెస్టు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ind – pak | భార‌త‌దేశంలో చొర‌బ‌డేందుకు య‌త్నించిన పాకిస్తాన్ pakistan citizen జాతీయుడిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు indian army మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో పాకిస్తానీ జాతీయుడు త‌చ్చాడుతుండ‌గా అరెస్టు చేసిందని అధికారులు వెల్ల‌డించారు. “పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ నుండి ఒక పాకిస్తానీ జాతీయుడిని అరెస్టు చేశారు” అని ఆర్మీ అధికారి తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మరణించిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.

- Advertisement -

Ind – pak | క‌ట్టుదిట్ట‌మ‌న భ‌ద్ర‌త‌

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొన‌సాగుతోన్న ఉద్రిక్తతల నేప‌థ్యంలో పూంచ్, రాజౌరి జిల్లాలతో సహా లోయలోని అనేక ప్రాంతాలలో భద్రతను క‌ట్టుదిట్టం చేశారు. విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్తాన్ దళాలు పదేపదే కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో కూడా ఈ భద్రతా చర్యలు పెరిగాయి, పాక్ కాల్పుల‌ను మ‌న దళాలు స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొడుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News