ePaper
More
    HomeతెలంగాణKTR | దొంగను దొంగ లెక్కే చూస్తారు.. సీఎంపై కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    KTR | దొంగను దొంగ లెక్కే చూస్తారు.. సీఎంపై కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​ రెడ్డి cm revanth reddy అసమర్థుడు, చేతకాని వాడని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ktr​ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సోమవారం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘తనను ఎక్కడికి వెళ్లిన దొంగలా చూస్తున్నారని’ రేవంత్​రెడ్డి అనడంపై కేటీఆర్​ స్పందిస్తూ.. దొంగను దొంగ లెక్కనే చూస్తారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్​రెడ్డి అన్నారు. సీఎం మాటలను బట్టి ఆయన చేతకాని వాడని తేలిపోయిందన్నారు. తెలంగాణను అవమానించేలా సీఎం వ్యాఖ్యలు చేశారని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    KTR | హామీలు అతి పెద్ద మోసం

    కాంగ్రెస్ congress​ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అతి పెద్ద మోసమని కేటీఆర్​ అన్నారు. ఇన్ని రోజులు హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం congress​ చేతులు ఎత్తేసిందన్నారు. సీఎం మాట్లాడుతూ తనను ఎవరూ నమ్మడం లేదని, అప్పు పుట్టడం లేదంటూ మాట్లాడడం ఆయన దివాళాకోరు తననానికి నిదర్శనమన్నారు. తనకు పరిపాలన చేతకాదని సీఎం ఒప్పుకున్నారని కేటీఆర్​ అన్నారు. దొంగను దొంగ లెక్కనే చూస్తారని కేటీఆర్​ ఎద్దేవా చేశారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్​ పార్టీ తప్పు చేసిందన్నారు.

    KTR | తప్పించుకోవడానికే..

    అధికారంలోకి రావడానికి కాంగ్రెస్​ అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని కేటీఆర్​ మండిపడ్డారు. ఇప్పుడు వాటిని అమలు చేయలేక సీఎం రేవంత్​రెడ్డి తప్పించుకునేలా మాట్లాడుతున్నారన్నారు. అందాల పోటీలకు పైసలు ఉన్నాయని గానీ, ఉద్యోగులకు ఇవ్వడానికి లేవా అని ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి రాష్ట్రాన్ని రాచి రంపాన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    KTR | నాయకత్వ లోపంతో..

    కేసీఆర్ kcr​ హయాంలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉంటే ఇవాళ ఎందుకు దివాళ తీసిందని కేటీఆర్​ ప్రశ్నించారు. నాయకత్వ లోపంతోనే నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్​ హయాంలో రైతుబంధు, పింఛన్లు సకాలంలో వచ్చేవని, ఇప్పుడు ఎందుకు రావడం లేదన్నారు. సీఎం రేవంత్​రెడ్డి రాష్ట్ర అప్పుల విషయంలో అనేక అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయన ఆగం చేశారని ఆరోపించారు. హైదరాబాద్​ hyderabad లో రియల్​ ఎస్టేట్​ పడిపోవడానికి హైడ్రా hydraa కారణమన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పడిపోయిందన్నారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...