WWE Wrestling | WWE రెజ్లింగ్​లో రానా దగ్గుబాటి! ఇండియా తరఫున ఫస్ట్​ సెలబ్రిటీగా రికార్డ్​
WWE Wrestling | WWE రెజ్లింగ్​లో రానా దగ్గుబాటి! ఇండియా తరఫున ఫస్ట్​ సెలబ్రిటీగా రికార్డ్​

అక్షరటుడే, హైదరాబాద్: WWE Wrestling | కుస్తీ పోటీలకు WWE (వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ టెలివిజన్‌ రియాలిటీ షోకు television reality show ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఉంది. ఇందులో పాల్గొనే రెజ్లర్లకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.

కాగా , WWE షోకు వెళ్లిన మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీగా first Indian celebrity టాలీవుడ్​ హీరో దగ్గుబాటి రానా Tollywood hero Daggubati Rana రికార్డు సృష్టించారు. అమెరికా లాస్​వేగాస్​లోని అలిజియంట్​ మైదానంలో జరిగిన WWE మ్యాచ్​లో రానా సందడి చేశారు.

WWE Wrestling | అనుభవాన్ని పంచుకున్న రానా

“41వ రెజిల్​మేనియా మ్యాచ్​ను WrestleMania match ప్రత్యక్షంగా చూడటం అద్భుతంగా ఉంది. WWE మన0 బాల్యంలో ఒక భాగం. ఇప్పుడు, దానిని ప్రత్యక్షంగా చూడటం, ప్రపంచ వేదికపై భారత్​ కు ప్రాతినిధ్యం వహించగలగడం గొప్ప అనుభవం. ఇది ఒక ఫుల్​-సర్కిల్ మూమెంట్. ” అని రానా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ మేరకు రానా ఫొటోలను సోషల్ మీడియాలో నెట్​ఫ్లిక్స్ షేర్​ చేసింది.