ePaper
More
    Homeక్రైంPrivate Hospital Seized | వీడియో కాల్​ ద్వారా వైద్యం.. గర్భంలోనే కవలల మృతి

    Private Hospital Seized | వీడియో కాల్​ ద్వారా వైద్యం.. గర్భంలోనే కవలల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hospital Seized | ఆరేళ్లుగా పిల్లల కోసం నిరీక్షిస్తున్న ఆ దంపతులు.. కొన్ని నెలల్లో తల్లిదండ్రులం కాబోతున్నామని సంతోషించారు. కానీ వారి ఆనందం ఆవిరి అయ్యింది. కవల పిల్లలు పుడుతున్నారని వారు కన్న కలలు కల్లలయ్యాయి.

    ఆస్పత్రి సిబ్బంది hospital staff నిర్లక్ష్యానికి తల్లి గర్భంలోనే ఇద్దరు శిశువులు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి rangareddy జిల్లా ఇబ్రహీంపట్నం ibrahimoatnam లోని విజయలక్ష్మి ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

    ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి కీర్తి, గణేష్‌ దంపతులు పిల్లల కోసం సంతాన సఫల్యా కేంద్రాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఐవీఎఫ్‌ పద్ధతిలో కీర్తి గర్భం దాల్చింది. ఐదు నెలల గర్భంతో ఉన్న ఆమెకు ఒక్కసారిగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు విజయలక్ష్మి ఆస్పత్రికి vijayalaxmi hospital తీసుకెళ్లారు.

    Hospital Seized | వీడియో కాల్​ మాట్లాడుతూ వైద్యం

    కీర్తిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో డాక్టర్​ అనుషారెడ్డి doctor anushareddy అందుబాటులో లేరు. దీంతో డాక్టర్​తో వాట్సాప్ whatsapp వీడియో కాల్ మాట్లాడుతూ..  సూచనలు చేయగా నర్సులు nurses ఆమెకు వైద్యం చేశారు. ఈ క్రమంలో వైద్యం వికటించడంతో గర్భంలోనే ఇద్దరు మగ శిశువులు మృతి చెందారు. డాక్టర్ నిర్లక్ష్యం, నర్సుల వైద్యంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఈ ఘటనపై స్పందించిన డీఎంహెచ్​వో dmho వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన జరిగినట్లు నిర్ధారించి రోగులను పంపించి ఆస్పత్రిని సీజ్​ చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...