అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRML Jobs | వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ Bharat Earth Movers Limited (బీఈఎంఎల్) నోటిఫికేషన్ notification జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 14లోపు ఆఫీసర్/అసిస్టెంట్ మేనేజర్ Officer/Assistant Manager పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
గ్రాడ్యుయేషన్‌తో Graduation పాటు ఎంబీఏ MBA (హెచ్ఆర్/ఐఆర్), ఎంఎస్‌డబ్ల్యూ MSW లేదా ఎంఏ MA (సోషల్‌వర్క్‌తో పాటు హెచ్ఆర్/ఐఆర్) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ Personnel Management అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో రెండేళ్ల డిప్లొమా, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేబర్ లెజిస్లేషన్‌తో Labour Legislation పాటు హెచ్ఆర్/ఐఆర్‌లో HR/IR ఫుల్ టైమ్ full time స్పెషలైజన్ పూర్తి చేసిన వార్హులు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థుల candidates గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు కాగా, ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా వర్గాలకు categories వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ General, EWS, OBC అభ్యర్థులు దరఖాస్తు ఫీజు application fee రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు SC, ST, PWD candidates ఫీజు మినహాయింపు ఉంటుంది. మరిన్ని వివరాలకు http://bemlindia.in/లో సంప్రదించవచ్చు.