ePaper
More
    HomeజాతీయంSupreme Court judges | సుప్రీం జ‌డ్జీల ఆస్తుల వెల్ల‌డి.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్.. సీజేఐ ఆస్తులివే..

    Supreme Court judges | సుప్రీం జ‌డ్జీల ఆస్తుల వెల్ల‌డి.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్.. సీజేఐ ఆస్తులివే..

    Published on

    Akshara Today News Desk: Supreme Court judges : సుప్రీంకోర్టు supreme court ప‌నితీరు, వ్య‌వ‌హార శైలిపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్న వేళ అత్యున్న‌త న్యాయ‌స్థానం పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంచే చ‌ర్య‌లు చేప‌ట్టింది.

    ఈ క్ర‌మంలో న్యాయ‌మూర్తుల judges assets list ఆస్తుల‌ను త‌న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలనే పూర్తి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా ఆస్తుల వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టింది. “సుప్రీంకోర్టు ఏప్రిల్ 1, 2025న ఈ కోర్టు న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటనలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని నిర్ణయించింది” అని సుప్రీంకోర్టు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే న్యాయమూర్తులు వెల్ల‌డించిన‌ ఆస్తుల ప్రకటనలు అప్‌లోడ్ చేస్తున్నామ‌ని, మిగ‌తా వారి ఆస్తుల వివ‌రాలు అందిన వెంటనే అప్‌లోడ్ చేస్తామ‌ని పేర్కొంది.

    Supreme Court judges : కొలీజియం పనితీరు కూడా..

    మ‌రోవైపు హైకోర్టులు, సుప్రీంకోర్టుకు నియామకాల ప్రక్రియ మొత్తాన్ని సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఇందులో హైకోర్టు కొలీజియం పాత్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం నుంచి వచ్చిన సూచ‌న‌లు, సుప్రీంకోర్టు కొలీజియం ప్రజల అవగాహన కోసం పరిగణనలోకి తీసుకోవడం వంటివి ఉన్నాయి.

    “హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన ప్రతిపాదనలు “నవంబర్ 9, 2022 నుండి మే 5, 2025 వరకు, పేర్లు, హైకోర్టు సర్వీస్, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన తేదీ, న్యాయ శాఖ నోటిఫికేషన్ తేదీ, నియామక తేదీ, ప్రత్యేక వర్గం (SC/ST/OBC/మైనారిటీ/మహిళ) అభ్యర్థి ఏదైనా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు/సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన వారా? అనే వివరాలను కూడా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.

    Supreme Court judges : ఆస్తులు వెల్ల‌డించిన జ‌డ్జీలు..

    సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రూ.55.75 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు, అలాగే ఆయన PPF ఖాతాలో రూ.1.06 కోట్లు ఉన్నాయి. అలాగే, దక్షిణ ఢిల్లీలో రెండు బెడ్‌రూమ్‌ల క‌లిగిన DDA ఫ్లాట్, కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో నాలుగు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్ ఉన్నాయి. గురుగ్రామ్‌లోని నాలుగు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌లో 56 శాతం వాటా ఉంది. మిగిలిన 44 శాతం కుమార్తెకు ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని విభజనకు ముందు నాటి పూర్వీకుల ఇంట్లో వాటా కూడా ఉంది.

    ఇక‌, ఈ నెల 14న చీఫ్ జ‌స్టిస్‌గా బాధ్యతలు చేప‌ట్ట‌నున్న జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బ్యాంకు ఖాతాల్లో రూ.19.63 లక్షలు, PPF ఖాతాలో రూ.6.59 లక్షలు ఉన్నాయి. మహారాష్ట్రలోని అమరావతిలో వారసత్వంగా ఒక ఇల్లు, ముంబై, ఢిల్లీలోని నఅపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. అమరావతి, నాగ్‌పూర్‌లలో వార‌స‌త్వంగా వ‌చ్చిన వ్యవసాయ భూమి ఉంది. అప్పులు రూ1.3 కోట్లు ఉన్నాయి.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...