Akshara Today: GOLD Price : బంగారం Gold price ధరలు తగ్గినట్టే తగ్గి క్రమేపి పెరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పండగలు, పెళ్లిళ్ల సీజన్స్‌లో బంగారం కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. అలాంటి వారికి కోలుకోలేని షాక్‌లు ఇస్తుంది బంగారం ధర.
గత మూడు నాలుగు రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. బంగారం రేట్లు మళ్లీ పెరిగేలోపే కొనాలనుకునే వాళ్లు కొనేస్తే మంచిది అంటున్నారు విశ్లేషకులు. మంగళవారం బంగారం ధరలు today gold rates చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,574లు కాగా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,776లుగా ఉంది. ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర రూ.7,181లుగా ఉంది.
GOLD Price : ధరలు ఇలా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. ఢిల్లీలో Delhi 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర తులం రూ.87,910, 24 క్యారెట్ల ధర రూ.95,890గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల రేటు రూ.95,740గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది.
గత కొన్ని రోజులుగా బంగారంతో పాటుగా వెండి Silverకి కూడా ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. అందకు తగ్గట్టు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. సిల్వర్ నగల కోసం మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా పెద్ద ఎత్తున వినియోగించడంతో డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. కిలో వెండి ధర రూ.1,08,900లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,900, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,07,900, ఢిల్లీలో వెండి కిలో ధర రూ.96,900, ముంబైలో రూ.96,900, బెంగళూరులో రూ.96,900, చెన్నైలో రూ.1,07,900 లుగా ఉంది.