IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్.. వర్షం కారణంగా రద్దవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులే చేసింది.
ప్యాట్ కమిన్స్ (3/19) ధాటికి 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆ జట్టును ట్రిస్టన్ స్టబ్స్(36 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్), అషుతోష్ శర్మ(26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41), విప్రజ్ నిగమ్(17 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 18)ఆదుకున్నారు. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసారు. 135 పరుగుల లక్ష్యచేధనకు దిగేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమవ్వగా.. భారీ వర్షం ఆటకు అంతరాయం కలిగించింది.
వర్షం ఆగినా.. మైదానం మొత్తం నీరు నిండిపోయాయి. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఆటను పున:ప్రారంభించేందుకు ఉప్పల్ గ్రౌండ్స్‌మెన్ తీవ్రంగా శ్రమించారు. కానీ ఔట్ ఫీల్డ్ బురదమయంగా ఉండటంతో అంపైర్లు ఆటను రద్దు చేసి చేరో పాయింట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడం ఇరు జట్లకు నష్టం చేసింది.
ఈ మ్యాచ్ రద్దవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 7 పాయింట్స్‌తో 8వ స్థానంలో నిలిచింది. చివరి మూడు మ్యాచ్‌లు గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో 13 పాయింట్స్ చేరుతాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఓ మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు విజయాలు సాధించాలి. అప్పుడే 17 పాయింట్స్‌తో టోర్నీలో ముందుడుగు వేస్తోంది.