Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్‌.. వెళ్లేందుకు సిద్ధం అవుదామా..
Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్‌.. వెళ్లేందుకు సిద్ధం అవుదామా..

అక్షరటుడే, న్యూఢిల్లీ: Amarnath Yatra : పుణ్యక్షేత్రాల పర్యటనలో అతి ముఖ్యమైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్‌ అయింది. జులై 3న ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 19న రక్షా బంధన్ పండుగతో ముగియనుంది. మంచుతో ఏర్పడిన శివలింగం Shivalingam ఫొటోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటికే 3,60,000 మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

యాత్ర తేదీ ఫిక్స్ అయిన నేపథ్యంలో బాల్టాల్, చందన్వారీ మార్గాలను శుభ్రం చేసే పనులు మొదలయ్యాయి. యాత్ర ఏర్పాట్లను లెఫ్టినెంట్ గవర్నర్ Lieutenant Governor పర్యవేక్షిస్తున్నారు. ఆయా మార్గాలపై భారీగా మంచు పేరుకుపోయి ఉంది. కొన్ని ప్రాంతాలలో మంచు 10 నుంచి 20 అడుగుల వరకు పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో మార్గం శుభ్రం చేయడంలో ఇబ్బంది ఎదురువుతున్నట్లు తెలుస్తోంది.