CP Sai Chaitanya | న్యాయ సంహిత సెక్షన్ల పోస్టర్ల ఆవిష్కరణ
CP Sai Chaitanya | న్యాయ సంహిత సెక్షన్ల పోస్టర్ల ఆవిష్కరణ

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : CP Sai Chaitanya | తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన భారత న్యాయ సంహితలోని సెక్షన్ల పోస్టర్లను సీపీ సాయిచైతన్య సోమవారం ఆవిష్కరించారు. ప్రతి మీ సేవ కేంద్రంలో న్యాయ సంహిత చట్టంలోని 121, 122, 132 సెక్షన్లపై ప్రజలకు అవగాహన కలిగించేలా వీటిని ప్రదర్శించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.