ePaper
More
    HomeతెలంగాణHeavy Rains | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన..

    Heavy Rains | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రంలో వాతావరణం weather విభిన్నంగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండుతున్నాయి. సాయంత్రం కాగానే ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. రోజూ కొన్ని ప్రాంతాల్లో వర్షం rain పడుతోంది. ఉదయం పది దాటితే భానుడు భగభగ మండుతున్నాడు. సాయంత్రం నాలుగు కాగానే వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు.

    కాగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం heavy rains కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. నిజామాబాద్​ nizamabad జిల్లా కేంద్రంలో సాయంత్ర 6 నుంచి గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మెదక్ medak​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి 7 గంటల తర్వాత వర్షం కురిసింది.

    Heavy Rains | పంటలకు నష్టం

    ఈదురుగాలులతో కూడిన వర్షంతో పంటలకు crops తీవ్ర నష్టం వాటిల్లింది. భారీగా గాలులు వీయడంతో  మామిడి రైతులు mango farmers తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలయాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటం లేదని, కొనుగోళ్లు వేగంగా జరపాలని కోరుతున్నారు. గాలులకు చెట్లు నేలకూలి విద్యుత్​ లైన్లపై పడ్డాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు వర్షంతో వాతావరణం చల్లబడి ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...