Saudi Arabia | సౌదీని కమ్మేసిన ఇసుక తుఫాను
Saudi Arabia | సౌదీని కమ్మేసిన ఇసుక తుఫాను

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Saudi Arabia | గల్ఫ్​ దేశమైన సౌదీ అరేబియాను భారీ ఇసుక తుఫాన్​ కమ్మేసింది. ఆ దేశ రాజధాని రియాద్​లో ఆకాశాన్ని తాకేలా ఇసుక తుఫాన్ రేగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సౌదీతో పాటు కువైట్, జోర్డాన్‌లలో కూడా ఇసుక తుఫాన్​ బీభత్సం సృష్టించింది. దీంతో మూడు దేశాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్​ దాటికి భారీ ఎత్తున లేచిన దుమ్ముతో ప్రజలు అవస్థలు పడ్డారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలను కూడా అధికారులు రద్దు చేశారు.