CM Revanth | అప్పు కోసం వెళ్తే దొంగల్లా చూస్తున్నారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
CM Revanth | అప్పు కోసం వెళ్తే దొంగల్లా చూస్తున్నారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | అప్పుల loans కోసం వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను దొంగల్లా చూస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy అన్నారు.

తెలంగాణ పోలీస్​ ‌‌– రియల్​ హీరోస్​ జీ అవార్డ్స్​ telangana police real heroes zee awards కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదని.. బయట ఎక్కడా అప్పు పుట్టడం లేదన్నారు. ఎవరు కూడా అణా పైసా ఇవ్వడం లేదని ఆవేదనతో మాట్లాడారు. అప్పు కోసం కలవడానికి వెళ్తే బ్యాంకర్లు bankers దొంగలను చూసినట్లు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ Delhiకి పోతే చెప్పులు కూడా ఎత్తుకుపోతామేమోనని అపాయింట్​మెంట్​ ఇస్తలేరన్నారు.

CM Revanth | వారి చేతుల్లో పావులుగా మారొద్దు

స్వీయ నియంత్రణే దీనికి పరిష్కారమని సీఎం అన్నారు. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే ఎవరైనా నమ్ముతారని చెప్పారు. వీధికెక్కి పరువు బజారులో పడేసుకుంటే ఎవరు నమ్మరని ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నాయకుల రాష్ట్ర పరువును బజారున పడేయొద్దని కోరారు. గతంలో బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండేందుకు రిటైర్‌మెంట్‌ వయసు పెంచారని సీఎం పేర్కొన్నారు.