అక్షరటుడే, ఇందల్వాయి:Transco | మండల పరిధిలోని గౌరారం సబ్స్టేషన్(Sub Station) పరిధిలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్(Transco SE Ravinder) పేర్కొన్నారు. సోమవారం సబ్స్టేషన్లో రూ.కోటితో అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్(Tranformer)ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ్మర్ యాక్షన్ ప్లాన్(Summer Action Plan)లో భాగంగా అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం ద్వారా గౌరారం, లింగాపూర్, జీకే తండాలో విద్యుత్ సరఫరాలకు ఇబ్బందులు తప్పనున్నాయన్నారు. కార్యక్రమంలో ఏఈ జ్ఞానేశ్వర్, డిచ్పల్లి డీఈ అల్జాపూర్ రమేశ్, డీఈ ఎంఆర్టీ వెంకటరమణ, ఏడీఈ ఎస్పీఎం నటరాజ్, ఏఈ టీఆర్ఈ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
