అక్షరటుడే, ఇందూరు: Care Degree College | కేర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని అయిన గుగులోత్ సౌమ్య జాతీయ ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికవ్వడం గర్వకారణమని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ (College Director Nara Sudhakar) అన్నారు. సోమవారం ఆమెను కళాశాలలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫుట్‌బాల్ (Foot Ball) క్రీడలో రాణిస్తూ అవార్డును గెలిచిన తొలి తెలంగాణ క్రీడాకారిణిగా సౌమ్య ఘనత సాధించిందన్నారు.
కోచ్ నాగరాజు (Coach Nagaraju) శిక్షణలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు. ఐడబ్ల్యూఎల్(IWL)లో ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున 9 గోల్స్‌తో ఉత్తమ ప్రతిభ, అలాగే గతేడాది టీమిండియా (Team India)విజయాల్లో కీలకపాత్ర పోషించినందుకు అవార్డు వరించిందని కోచ్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో తండ్రి గోపి, మాజీ కార్పొరేటర్ సుధీర్, కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.