అక్షరటుడే, వెబ్‌డెస్క్: Election Commission | కేంద్ర ఎన్నికల సంఘం Central Election Commission అనేక సంస్కరణలకు తెర తీస్తోంది. సీఈసీ CEC అందిస్తున్న అన్ని రకాల సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురానుంది. ఓటర్లు voters, ఎన్నికల అధికారుల election officials కోసం ఇప్పటికే ఉన్న 40 యాప్‌లను కలిపి ఒకే యాప్‌పై సేవలందించనుంది. దీనికి సంబంధించి వెబ్‌సైట్ ECINET ను ఎన్నికల సంఘం Election Commission త్వరలోనే ప్రారంభించనుంది. ఈ యాప్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. ఈ సంవత్సరం చివరలో జరిగే బీహార్ ఎన్నికలకు Bihar elections ముందు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.
కొత్త యాప్ new app ఓటర్ టర్నౌట్ యాప్, నో యువర్ క్యాండిడేట్ యాప్, ఎన్నికల ఫలితాల యాప్ వంటి ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌లను, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు Election Registration Officers, బూత్ లెవల్ ఆఫీసర్లు Booth Level Officers ఇతర వాటాదారుల కోసం ఉన్న అన్ని ప్లాట్‌ఫామ్‌లను ఒకే యాప్ కిందకు తీసుకురానున్నారు. మార్చిలో జరిగిన ప్రధాన ఎన్నికల అధికారుల Chief Election Officers సమావేశంలో సీఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అన్ని సేవలను ఏకీకృత ప్లాట్‌ఫామ్‌కు తీసుకు రావాలని CEC జ్ఞానేశ్ కుమార్, ECలు సుఖ్‌బీర్ సింగ్ సంధు Sukhbir Singh Sandhu, వివేక్ జోషిలతో కలిసి నిర్ణయించారారు. ఈనేపథ్యంలో యాప్ రూపకల్పనతో పాటు ప్రయోగాత్మక అమలు కొనసాగుతోంది. ప్రస్తుతం 40 యాప్‌లలో అందిస్తున్న సేవలన్నీ ఒకే యాప్‌లో single app లభించనున్నాయి.