ePaper
More
    HomeజాతీయంSupreme Court | తాజ్‌మ‌హల్ కూడా కావాలా?.. ఎర్ర‌కోట అప్ప‌గించాల‌న్న పిటిష‌న‌ర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

    Supreme Court | తాజ్‌మ‌హల్ కూడా కావాలా?.. ఎర్ర‌కోట అప్ప‌గించాల‌న్న పిటిష‌న‌ర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Supreme Court | ఎర్ర‌కోట‌ను అప్ప‌గించాలని కోరుతూ ఓ మ‌హిళ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను petition సుప్రీంకోర్టు Supreme Court సోమ‌వారం కొట్టేసింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఎర్ర‌కోట ఒక‌టే చాలా.. తాజ్‌మ‌హాల్ కూడా కావాలా? అని ప్ర‌శ్నించింది. వార‌స‌త్వంగా వ‌చ్చిన ఎర్రకోటను Red Fort త‌మ‌కు తిరిగి అప్ప‌గించాల‌ని ఓ మ‌హిళ woman పిటిష‌న్ దాఖ‌లు filed petition చేసింది.

    దేశాన్ని వందల ఏళ్ల పాటు పాలించిన మొఘల్ రాజవంశ Mughal dynasty వారసురాలు, మొఘల్ సామ్రాజ్య Mughal emperor చివరి చక్రవర్తి ముని మనవడు మీర్జా మహ్మద్ బేదర్ భక్త్ భార్య సుల్తానా బేగమ్ Sultana Begum ఈ పిటిష‌న్‌ను వేసింది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆమె పింఛ‌న్ డబ్బులతో జీవనం సాగిస్తోంది. కాగా.. ఆమె తమ వారసత్వ సంపద అయిన ఢిల్లీలోని ఎర్ర కోటను త‌న‌కు అప్ప‌గించాల‌ని గ‌తంలో హైకోర్టును High Court ఆశ్ర‌యించ‌గా, అక్క‌డ చుక్కెదురైంది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో Supreme Court పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

    Taj Mahal | సుప్రీం ఆగ్ర‌హం..

    ఈ పిటిష‌న్‌ను సోమ‌వారం విచారించిన సుప్రీంకోర్టు Supreme Court పిటిష‌న‌ర్‌పై petitioner ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్రభుత్వం government ఎర్రకోటను Red Fort స్వాధీనం చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత కోర్టుకు రావటాన్ని న్యాయ‌స్థానం తప్పుబట్టింది. పిటిషన్‌ను అర్థం లేనిదిగా భావిస్తూ కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ కన్నా Chief Justice Sanjeev Kanna మాట్లాడుతూ.. ‘ఎర్రకోట మాత్రమే ఎందుకు.. ఫతేఫుర్ సిఖ్రీ, తాజ్ మహల్‌ Taj Mahal కావాలని అడగొచ్చు కదా.. దీనిపై మీరు వాదించాలని అనుకుంటున్నారా.. ఇదో చెత్త పిటిషన్’ rubbish petition అంటూ మండిపడ్డారు. సుల్తానా బేగమ్ Sultana Begum వేసిన పిటిషన్‌ను కొట్టి పారేశారు.

    “మొదట్లో దాఖలు చేసిన రిట్ పిటిషన్ తప్పుగా భావించినది అర్హత లేనిది. దానిని స్వీకరించలేము” అని CJI సంజీవ్ ఖన్నా CJI Sanjiv Khanna అన్నారు. పిటిష‌న‌ర్ వాదనలను పరిగణనలోకి తీసుకుంటే ఆగ్రా agra, ఫతేపురి సిక్రీ, ఇతర ప్రదేశాలలోని కోటలు కూడా అడుగుతార‌మో అని వ్యాఖ్యానించారు.

    1857లో జరిగిన మొదటి స్వాతంత్య్ర యుద్ధం తర్వాత బ్రిటిష్ పాల‌కులు British rulers ఎర్రకోటను Red Fort బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అయితే, తన కుటుంబం ఎర్రకోటను Red Fort అన్యాయంగా కోల్పోయిందని సుల్తానా బేగం Sultana Begum తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్పటి మొగ‌ల్ చివ‌రి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ II నుంచి అక్ర‌మంగా స్వాధీనం చేసుకున్నారని ఆమె తెలిపారు.

    Latest articles

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    Trump Tariffs | అన్నంత పని చేసిన ట్రంప్​.. మరో 25 శాతం సుంకాల బాదుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ భారత్​పై...

    BC Reservations | బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తాం

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BC Reservations | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిజామాబాద్...

    More like this

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    Trump Tariffs | అన్నంత పని చేసిన ట్రంప్​.. మరో 25 శాతం సుంకాల బాదుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ భారత్​పై...