అక్షరటుడే నిజాంసాగర్:Nizamsagar | చెట్టును ఆటో(Auto) ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మండలంలోని సుల్తాన్‌నగర్(Sultanpur) శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన మేస్త్రీలు సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్(Narayana Khed)లో పనినిమిత్తం ఆటోలో బయలుదేరారు. ఆటో సుల్తాన్‌నగర్ కు చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. దీంతో ఆటోలోని హబీబ్, బషీర్, జాహిద్, జాకీర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ‘108’లో క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రి(Hospital)కి తరలించారు.
