ePaper
More
    HomeతెలంగాణAmberpet | అంబర్​పేట్​ ఫ్లైఓవర్​ ప్రారంభం

    Amberpet | అంబర్​పేట్​ ఫ్లైఓవర్​ ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amberpet | హైదరాబాద్​ hyderabad నగరంలో నిర్మించిన అంబర్​పేట్​ ఫ్లై ఓవర్​ను కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ సోమవారం ప్రారంభించారు. రూ.415 కోట్లతో ఈ ఫ్లైఓవర్​ నిర్మించారు. ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ kagaz nagar​లో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్​గా ఆయన ఫ్లై ఓవర్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.5,416 కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి union minister kishan reddy మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చాలా రహదారులను కేంద్రం హైవేలుగా మారుస్తోందన్నారు.

    అంబర్​పేట ఫ్లై ఓవర్​తో ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లై ఓవర్​ను కేంద్రం నిర్మించింది. వాహనాల రద్దీ అధికంగా ఉండే ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణంతో నగరవాసులకు ఎంతో మేలు జరగనుంది. అయితే ఫ్లై ఓవర్​ నిర్మాణం గతంలోనే పూర్తయింది. దీంతో చాలా రోజుల నుంచే వాహనాలను ఫ్లై ఓవర్​ మీదుగా అనుమతిస్తున్నారు. బ్రిడ్జి కింద పలు పనులు ఇటీవల పూర్తి చేశారు. తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీ అంబర్​పేట్​ ఫ్లై ఓవర్​ను ప్రారంభించారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...