అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gulf Scam | గల్ఫ్ వెళ్తావా పంపిస్తాం అంటూ ఓ మహిళ ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసింది. తమ ఏజెన్సీ ద్వారా గల్ఫ్ దేశాలకు పంపిస్తామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో బేరాలకు దిగింది. దీంతో తనకు ఎందుకు ఫోన్ చేశావని ఎమ్మెల్యే అడగ్గా.. సదరు యువతి ఆయనపైనే ఆగ్రహం వ్యక్తి చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ఈ విషయమై జగిత్యాల ఎస్పీకి సమాచారం అందించారు.
Gulf Scam | అమాయకులే టార్గెట్..
ఎమ్మెల్యే అందించిన సమాచారం మేరకు జగిత్యాల పోలీసులు విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గల్ఫ్ పంపిస్తామని చెప్పి అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా రంగపేట గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి జగిత్యాలలో అనుమతి లేకుండా లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. తన దగ్గర ఓ యువతిని పనిలో పెట్టుకొని ఆమెతో ఫోన్లు చేయిస్తున్నాడు. ఎవరైనా నమ్మి డబ్బులు కడితే వారిని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నవీన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.