ePaper
More
    Homeబిజినెస్​Postal Insurance | పోస్టల్‌ ఇన్సూరెన్స్ తో ఆర్థిక భరోసా..

    Postal Insurance | పోస్టల్‌ ఇన్సూరెన్స్ తో ఆర్థిక భరోసా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Postal Insurance | గ్రామీణ ప్రజలకు(Rural people) ఆర్థిక భద్రత కల్పించడం, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సేవలను సరసమైన ధరలలో అందించడం కోసం పోస్టాఫీసు పలు ఇన్సూరెన్స్‌(Insurance) పథకాలను అమలు చేస్తోంది. రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌(Postal Life Insurance)లో గ్రామ సువిధ పాలసీ (కన్వర్టబుల్‌ హోల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌) ప్రధానమైనది. మార్కెట్‌లో ఉన్న ఇతర పాలసీలకన్నా ప్రీమియం(Premium) తక్కువగా ఉండడం, రాబడి ఎక్కువగా ఉండడం దీని ప్రత్యేకత. పాలసీ తీసుకోవడానికి, ప్రీమియం చెల్లించడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామంలోని పోస్టాఫీసును గానీ, పోస్టల్‌ వెబ్‌సైట్‌(Postal website)ను గానీ సంప్రదించాలి. ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, వైద్యాధికారి ధ్రువీకరణ పత్రం అవసరం.

    Postal Insurance | పాలసీ వివరాలు..

    ఆర్‌పీఎల్‌ఐ(RPLI) గ్రామ సువిధ పాలసీ తీసుకోవడానికి 19 ఏళ్లు నిండినవారు అర్హులు. గరిష్ట వయసు 45 ఏళ్లు.
    రూ. 10 వేలనుంచి రూ. 10 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు.
    నెలవారీ(Monthly)గానే కాకుండా మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి ప్రీమియం చెల్లించవచ్చు.
    ఏటా వెయ్యి రూపాయల పాలసీ విలువకు రూ. 60 చొప్పున బోనస్‌(Bonus) జమ అవుతుంది.
    మూడేళ్ల తర్వాత పాలసీని సరెండర్‌ చేయవచ్చు. ఐదేళ్లలోపు సరెండర్‌ చేస్తే ఎలాంటి బోనస్‌ లభంచదు.
    నాలుగేళ్ల తర్వాత డబ్బులు అవసరం అయితే లోన్‌(Loan) తీసుకునే అవకాశం ఉంది.
    పాలసీ వ్యవధిలోగా పాలసీదారు మరణిస్తే పాలసీ మొత్తంతోపాటు బోనస్‌ను నామినీకి చెల్లిస్తారు. ఒకవేళ పాలసీదారు జీవించి ఉంటే గడువు తీరాక పాలసీ మొత్తంతోపాటు బోనస్‌ను క్లెయిమ్‌(Claim) చేసుకోవచ్చు.

    Postal Insurance | ఎంత రాబడి రావొచ్చంటే..

    25 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్ల కాలానికి రూ. 10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారనుకుందాం. ఆ వ్యక్తి ప్రతినెలా(Every month) సుమారుగా రూ. 1,650 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. త్రైమాసికానికి రూ. 4,800, అర్ధ వార్షికానికి రూ. 9,350, వార్షికానికి(Yearly) రూ. 17,750 ప్రీమియం చెల్లించాలి. దీనికి జీఎస్టీ అదనం. పాలసీ గడువు తీరేంతవరకు పాలసీదారు జీవించి ఉంటే రూ. 32 లక్షలకుపైగా లభిస్తాయి. ఈ మొత్తం వృద్ధాప్యంలో ఎంతో భరోసా ఇస్తుంది.

    Latest articles

    BHEL Notifications | బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఈనెల 28తో ముగియనున్న దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BHEL Notifications | భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(BHEL) మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాలలో...

    Allu Arjun | అల్లు అర్జున్- అట్లీ సినిమాలో విల‌న్‌గా త‌మిళ సూప‌ర్ స్టార్.. అంచ‌నాలు పీక్స్‌కి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్ప 2...

    Stock Market | ఆరో రోజూ కొనసాగిన లాభాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి....

    Traffic signals | పనిచేయని ట్రాఫిక్​ సిగ్నళ్లతో అవస్థలెన్నో..

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Traffic signals | నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల ట్రాఫిక్స మస్యలు వస్తున్నాయి....

    More like this