ePaper
More
    Homeబిజినెస్​Car Insurance | కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోండి..

    Car Insurance | కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోండి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Car Insurance | కారు కొనాల‌న్న కోరిక‌ చాలా మందికి ఉంటుంది. ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుతో న‌చ్చిన కారు(Car)ను కొంటుంటారు. ప్ర‌స్తుతం మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవ‌న ప్ర‌మాణాలతో పాటు ఆదాయం కూడా పెరగడంతో కారు కొనాల‌న్న కోరిక‌ను నెర‌వేర్చుకుంటున్నారు. అయితే, కారు డిజైన్‌, మోడ‌ల్ పెట్టే దృష్టి.. ఎంతో కీల‌క‌మైన ఇన్సూరెన్స్(Insurance) విష‌యంలో పెట్ట‌డం లేదు. ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా ఆ త‌ర్వాత చేసే కొన్ని త‌ప్పులు ఖ‌రీదైన‌విగా మారుతున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్(Insurance Claims) రిజెక్ట్ కావ‌డం, ఎక్కువ ప్రీమియం(Premium) చెల్లింపుల‌కు దారి తీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వాహ‌న‌దారులు న‌ష్ట‌పోతున్నారు. అయితే, ఇన్సూరెన్స్ గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకోవ‌చ్చు.

    Car Insurance | వీటిని గుర్తుంచుకోండి..

    • చాలా మంది కారు న‌డ‌ప‌డం, స‌ర్వీసింగ్‌పై పెట్టే దృష్టి ఇన్సూరెన్స్ గ‌డువుపై పెట్ట‌రు. ఇన్సూరెన్స్ ఎక్స్​పెయిరీ అయితే స‌కాలంలో రెన్యూవ‌ల్(Renewal) చేసుకోవాలి. లేక‌పోతే మీరు కూడ‌బెట్టుకున్న నో క్లెయిమ్(No Claim) బోన‌స్ వ‌ల్ల రావాల్సిన డిస్కౌంట్ కోల్పోతారు. లేటుగా పాల‌సీ రెన్యూవ‌ల్ చేస్తే తిరిగి మొద‌టి నుంచి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
    • కారు కొన్నాక షోరూంలో కానీ, బ‌య‌ట కానీ ఎలాంటి మార్పులు చేసినా దానివ‌ల్ల మీరు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం(Insurance Premium) పెరుగుతుంది. ఒక‌వేళ పాల‌సీ తీసుకునే స‌మ‌యంలో ఈ మార్పుల గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియ‌క‌పోతే త‌ర్వాత క్లెయిమ్ కోసం ప్ర‌య‌త్నించిన‌ప్పుడు రిజెక్ట్ చేసే అవ‌కాశ‌ముంది.
    • మీరు అధిక ప్రీమియం కార‌ణంగా పాలసీ తీసుకోవ‌డం క‌ష్టంగా మారితే, మీరు ఇన్సూరెన్స్ కంపెనీ(Insurance Company) వారితో మాట్లాడి క్లెయిమ్‌లో కొంత భాగాన్ని వ‌దులుకునేందుకు అంగీక‌రిస్తే వారు ప్రీమియం త‌గ్గిస్తారు.
    • మీ కారుపై ఏదైనా గీత‌లు, స్క్రాచెస్ ప‌డితే దానికి సొంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి చేయించుకోవ‌డం మంచిది. ఒక‌వేళ దీనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వెళ్తే కారు ఓన‌ర్ నో క్లెయిమ్ బోన‌స్ కోల్పోవ‌డంతో పాటు పాల‌సీ ప్రీమియం(Policy Premium) 50 శాతం పెంచేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది.
    • చాలా మందికి అస‌లు తెలియ‌ని ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. న‌గ‌రాల్లో క్యాబ్ స‌ర్వీసెస్(Cab Services) అందుబాటులోకి రావ‌డంతో చాలా మంది సొంత కార్ల‌ను వినియోగించ‌డం త‌గ్గించారు. ఇలాంటి వారు ఇన్సూరెన్స్ కంపెనీ వ‌ద్ద న‌డిపిన కిలోమీట‌ర్ల‌కు మాత్ర‌మే ఇన్సూరెన్స్ తీసుకునే సౌక‌ర్యాన్ని ఉప‌యోగించుకోవ‌డం ఉత్త‌మం. ఒక‌వేళ ముందుగా చెప్పిన కిలోమీట‌ర్ల కంటే త‌క్కువగా కారును న‌డిపితే ఆ మేర‌కు త‌ర్వాత ప్రీమియం చెల్లింపులో డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...