- Advertisement -
HomeUncategorizedJunior NTR | ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. బ‌ర్త్ డే రోజు రెండు స‌ర్‌ప్రైజింగ్...

Junior NTR | ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. బ‌ర్త్ డే రోజు రెండు స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Junior NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్‌గా కీర్తించ‌బ‌డుతున్నాడు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇటీవ‌ల దేవ‌ర చిత్రంతో ప‌ల‌క‌రించాడు.

కాగా.. ఈ సినిమా కూడా మంచి హిట్ కావ‌డంతో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెరిగింది. త్వ‌ర‌లో వార్ 2తో బాలీవుడ్ ప్రేక్ష‌కులని కూడా ప‌ల‌క‌రించ‌నున్నాడు. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌(Prashanth Neel)తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. దీనిపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ నెల 20న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ నీల్ (NTR Neel) ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది.

- Advertisement -

Junior NTR | ఫ్యాన్స్‌కి పండ‌గే..

బ‌ర్త్ డే(Birth Day) సంద‌ర్భంగా ఎన్టీఆర్ ‘వార్ 2’ (War 2) మూవీ నుంచి ఆయన లుక్‌తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మూవీ టీం సన్నాహాలు చేస్తున్న‌ట్టు ప్రచారం సాగుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌(NTR Fans)కు పండగే. ఒకే రోజు రెండు గిఫ్ట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు మూవీస్‌పై ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి బజ్(Buzz) ఓ రేంజ్‌లో ఉంది. మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ల‌వ‌ర్స్ కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘డ్రాగన్'(Dragan) అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ ‌(గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సమర్పణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ఇంటర్నేషనల్ లెవల్ అంటూ రవిశంకర్(Ravi Shanker) పలు సందర్భాల్లో కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కర్ణాటకలో యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్(NTR) ఇటీవలే జాయిన్ అయిన‌ట్టు తెలుస్తుంది. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ న‌టించిన వార్ 2 ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్ ‘రా’ (RAW) ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News