IPL 2025 | 6 బంతుల్లో 6 సిక్సర్లు.. చరిత్ర సృష్టించిన రియాన్ పరాగ్
IPL 2025 | 6 బంతుల్లో 6 సిక్సర్లు.. చరిత్ర సృష్టించిన రియాన్ పరాగ్

Akshara Today: IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ riyan parag history చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్(IPL) 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు.

కేకేఆర్ స్పిన్నర్ మోయిన్ అలీ(Moin Ali) వేసిన 13వ ఓవర్‌లో చివరి 5 బంతులను 5 సిక్సర్లుగా మలిచిన రియాన్ పరాగ్.. వరుణ్ చక్రవర్తీ వేసిన 14వ ఓవర్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా తరలించాడు. ఇలా వరుసగా 6 బంతులు ఎదుర్కొని 6 సిక్స్‌లు కొట్టాడు. 18 ఏళ్ల ఐపీఎల్(IPL) చరిత్రలోనే ఏ బ్యాటర్ కూడా ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించలేదు. రియాన్ పరాగ్ ఈ ఘనతను అందుకొని చరిత్రకెక్కాడు. రియాన్ పరాగ్(Riyan Parag) ధాటికి మోయిన్ అలీ ఒకే ఓవర్‌లో 32 పరుగులు సమర్పించుకున్నాడు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన రియాన్ పరాగ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కీలక సమయంలో రియాన్ పరాగ్(45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95) ఔటవ్వడం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 57 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals) నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్‌ దూబే వరుసగా 6, 4, 6 బాది ఆశలు రేకెత్తించాడు. కానీ ఆఖరి బంతికి 3 పరుగులు చేయలేకపోయాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడినా అభిమానుల మనసులను గెలుచుకుంది.

IPL 2025 | ఇదొక రికార్డ్..

ఐపీఎల్ 2025 IPL 2025 హోరా హోరీగా సాగుతుంది. ఈ సారి ప్లే ఆఫ్స్‌కి ఏ జ‌ట్లు చేరుకుంటాయా అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఇప్ప‌టికే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. మిగ‌తా మూడు స్థానాల‌లో ఏ జ‌ట్లు నిలుస్తాయా అన్న‌ది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Night Riders), రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠమ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్(KKR) విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రియాన్ ప‌రాగ్ విధ్వంసంతో 205 ప‌రుగులు చేసింది. కేవ‌లం ఒక్క ప‌రుగు తేడాతో ఓడింది.